టాలీవుడ్ నటి కియారా అడ్వాణీ పేరు కియారా కాదంటా. ‘తొలుత నా పేరు అలియా అడ్వాణీ. నటుడు సల్మాన్‌ఖాన్ పేరు మార్చుకోమన్నాడు’ అని చెబుతోందీ ముద్దుగుమ్మ.
"చిత్రసీమలో ఇద్దరు అలియాలు (అలియా భట్ - అలియా అడ్వాణీ) ఉంటే చాలా గందరగోళంగా ఉందని చెప్పాడు సల్మాన్‌ఖాన్. అందుకే నా పేరును కియారాగా మార్చుకున్నా. ఇప్పుడు నా తల్లితండ్రులు కూడా వాళ్లు పెట్టిన (అలియా) మానేసి కియారా అని పిలుస్తున్నారు".
-కియారా అడ్వాణీ, నటి