తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కబీర్​ సింగ్'​ విజయంపై కియారా భావోద్వేగ సందేశం - కియారా అడ్వాణీ

'కబీర్ సింగ్' విడుదలై నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకుంది హీరోయిన్ కియారా అడ్వాణీ. విజయం కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది.

కియారా అడ్వాణీ

By

Published : Jul 22, 2019, 2:43 PM IST

షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ జంటగా నటించిన చిత్రం 'కబీర్ సింగ్.' గత నెలలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్​ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. విడుదలై నెలరోజులు పూర్తయిన సందర్భంగా హీరోయిన్ కియారా తన సంతోషాన్ని ఇన్​స్టాలో పంచుకుంది. చిత్ర బృందానికి, దర్శకుడు సందీప్ రెడ్డి, హీరో షాహిద్ కపూర్​కు ధన్యవాదాలు చెప్పింది.

'ప్రతి క్షణం 'కబీర్ సింగ్' విజయాన్ని మీతో పంచుకోవాలనుకున్నా. కానీ ఈ విషయాన్ని ఎలా మెుదలు పెట్టాలో తెలియట్లేదు. సరిగ్గా ఏడాది క్రితం నాకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశా. ప్రీతి పాత్రలో ఉన్న బలం, ప్రేమ తదితర అంశాలు నన్ను ఈ సినిమా చేసేందుకు ప్రోత్సాహించాయి.' -కియారా అడ్వాణీ,హీరోయిన్

కియారా అడ్వాణీ

హీరో షాహిద్ కపూర్​తో నటించడం తన అదృష్టమని చెప్పిందీ భామ. తనలో ధైర్యం నింపి, ఈ చిత్ర ప్రయాణంలో ఎంతో ప్రోత్సహించాడని ప్రశంసించింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు సినిమాలపై ఉన్న పిచ్చి, ఇష్టమే ఇందులోని పాత్రలు అద్భుతంగా వచ్చేలా చేశాయని అంది హీరోయిన్ కియారా అడ్వాణీ. నిర్మాతలతో పాటు సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పింది.

కబీర్ సింగ్ సినిమా స్టిల్

ఈ సినిమా ఇప్పటికే రూ.245 కోట్లు వసూలు చేసింది. తెలుగు బ్లాక్​బస్టర్ 'అర్జున్ రెడ్డి' రీమేక్​గా తెరకెక్కిందీ సినిమా.

ఇది సంగతి: 'కబీర్ సింగ్' జోడీ.. చేసేను సందడి

ABOUT THE AUTHOR

...view details