అనుకున్నట్లే ఊహాగానాలు నిజమయ్యాయి. దర్శకుడు శంకర్-హీరో రామ్‌చరణ్ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్గా ఎంపికైంది. శనివారం(జులై 31) కియారా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ, చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. గతంలో చరణ్, కియారా 'వినయ విధేయ రామ' చిత్రంలో కలిసి నటించారు.
RC 15: శంకర్-చెర్రీ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ - Kiara advani in shankar film
దర్శకుడు శంకర్-హీరో రామ్‌చరణ్ కాంబోలో తెరెకక్కనున్న సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్గా ఖరారైంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

శంకర్-చెర్రీ
శంకర్ తీయబోయే ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల 135 మంది మ్యూజిషియన్లతో కలిసి ఆయన ఈ సినిమాకు సంబంధించిన తొలి రికార్డింగ్ పూర్తి చేశారు. కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్, మాటల రచయితగా సాయి మాధవ్ బుర్రాను ఎంపిక చేసింది చిత్రబృందం.
ఇదీ చూడండి: RC 15: రామ్‌చరణ్ కొత్త సినిమాకు సంగీత దర్శకుడు ఫిక్స్