విభిన్నమైన ఫ్యాషన్ దుస్తులతో సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు మెరుస్తుంటారు నటీనటులు. అయితే బాలీవుడ్ అందాల తారలు భూమి పెడ్నేకర్, కియారా అడ్వాణీ మాత్రం ఓ అడుగు ముందుకేశారు. ప్రైవేటు క్యాలెండర్ కోసం దుస్తులు లేకుండా పోజులిచ్చారు. ఇవి ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
'ఎంఎస్ ధోని' బయోపిక్‌తో తెలుగు తెరకి పరిచయమైన నటి కియారా అడ్వాణీ. 'భరత్ అనే నేను'తో కథానాయికగా ప్రేక్షకులకు మరింత చేరువైంది. అనంతరం బాలివుడ్లో బాగానే ఛాన్స్‌లు కొట్టేసింది. తాజాగా ఈ భామ ఓ క్యాలెండర్ ఆవిష్కరణకు బోల్డ్‌గా పోజులిచ్చింది. ఓ అరటి ఆకుని తన వక్షోజాలకు అడ్డుపెట్టుకొని తన అందాలను ఆరబోసింది.