తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఖుషీ కపూర్ బాలీవుడ్​ ఎంట్రీకి రంగం సిద్ధం - ఖుషీ కపూర్​ బోనీ కపూర్​

శ్రీదేవి చిన్నకుమార్తె ఖుషీ కపూర్​ బాలీవుడ్​ ఎంట్రీపై ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్​ స్పష్టత ఇచ్చారు. త్వరలోనే ఓ సినిమాతో ఖుషీ పరిచయం కాబోతుందని.. అయితే ఆ చిత్రాన్ని తాను నిర్మించడం లేదని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Khushi Kapoor to enter B'wood soon, Boney Kapoor reveals why he won't launch her
ఖుషీ కపూర్ బాలీవుడ్​ ఎంట్రీకి రంగం సిద్ధం

By

Published : Jan 20, 2021, 10:48 AM IST

దివంగత నటి శ్రీదేవి సినీవారసురాలిగా ఇప్పటికే ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా అదేబాటలో కథానాయికగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఖుషీ కపూర్​ సినిమాల్లో ఎంట్రీపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె తండ్రి, ప్రముఖ చిత్ర నిర్మాత బోనీ కపూర్‌ స్పందించారు.

ఖుషీ కపూర్

"మా చిన్నమ్మాయి(ఖుషీ కపూర్​)ని చిత్రసీమకు పరిచయం చేయడానికి కావాల్సిన అన్నీహంగులు ఉన్నాయి. అయితే కథానాయికగా పరిచయం చేసేది మాత్రం నేను కాదు. కారణం ఏమిటంటే చిత్ర నిర్మాతగా నాకు, ఓ నటిగా ఖుషీకి ఇదేమంత మంచిది కాదు. ఎంత కుటుంబం చేయూత ఉన్నా.. ఇతర నటీమణుల్లాగే మా అమ్మాయీ సొంతంగా రాణించాలని కోరుకుంటాను. ఆ కారణంతోనే నేను ఆమెను తొలిసారిగా వెండితెరకు పరిచయం చేయడం లేదు".

- బోనీ కపూర్​, బాలీవుడ్​ నిర్మాత

ఖుషీ కపూర్

ఖుషీ కపూర్‌.. ఇప్పటికే లండన్‌ ఫిలిం స్కూల్లో నటన కోసం శిక్షణ తీసుకుంది. ఆమె ప్రస్తుతం ఇన్​స్టాగ్రామ్​లో యాక్టివ్​గా ఉంటూ.. తరచూ ఫొటోషూట్​లలో పాల్గొని వాటిని అందులో పంచుకుంటోంది. ఇన్​స్టాగ్రామ్​లో ఖుషీ కపూర్​కు 3 లక్షల మంది పైగా ఫాలోవర్స్​ ఉన్నారు.

తల్లిదండ్రులతో ఖుషీ కపూర్

ఇదీ చూడండి:'ఆర్​ఆర్​ఆర్'​ టీజర్​ విడుదలలో చిన్న మార్పు!

ABOUT THE AUTHOR

...view details