తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సూపర్ స్టార్​తో ఖుష్బూ మరోసారి .. ఫ్యాన్స్ ఖుష్​! - ranikanth, khushboo

హిట్ కాంబినేషన్​ అయిన రజనీకాంత్ - ఖుష్బూ.. మరోసారి కలిసి నటించనున్నారు. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్​గా ఖుష్బూను సంప్రదించిందట చిత్రబృందం.

khushboo act in a rajanikanth movie
ఖుష్బూ

By

Published : Nov 28, 2019, 10:21 PM IST

కోలీవుడ్​లో రజనీకాంత్‌- ఖుష్బూ జోడికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్​ ఉంది. వీరి కాంబినేషన్​లో వచ్చిన 'అన్నామలై', 'మన్నన్‌ పాండియన్‌', 'నట్టుక్కు ఒరు నల్లవన్‌.. లాంటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు మరోసారి కలిసి పనిచేయనున్నారని సమాచారం. దర్శకుడు శివ.. రజనీతో చేయబోయే సినిమాలో ఖుష్బూను హీరోయిన్​గా తీసుకోబోతున్నారట.

త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం సూపర్​స్టార్ 168వ సినిమా. రజనీ పక్కన కనిపించేందుకు యువ కథానాయిక కాకుండా సీనియర్‌ నటిని ఎంపిక చేసే ఆలోచనలో ఉందట చిత్ర బృందం. ఈ మేరకు ఖుష్బూని సంప్రదించారని సమాచారం.

ఆయన గత చిత్రాలు కాలా, పేటల్లో సీనియర్‌ నాయికలే మెరిసి అలరించారు. ఈ నేపథ్యంలో ఖుష్బూ పేరు వినిపిస్తున్నందున అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.

ఇదీ చదవండి: "నేను ఆర్మీ అమ్మాయిని.. అందుకే భయం లేదు"

ABOUT THE AUTHOR

...view details