తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాస్ మహారాజ్ చిత్రంలో యాక్షన్ కింగ్ - ఖిలాడిలో అర్జున్

మాస్ మహారాజ్ రవితేజ కొత్త చిత్రం 'ఖిలాడి'. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటించనున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది చిత్రబృందం.

Khiladi movie welcomes Action King Arjun on board
మాస్ మహారాజా చిత్రంలో యాక్షన్ సింగ్

By

Published : Jan 30, 2021, 1:13 PM IST

Updated : Jan 30, 2021, 2:21 PM IST

మాస్‌ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం 'ఖిలాడి'. 'వీర' సినిమాతో రవితేజకు హిట్టిచ్చిన రమేశ్‌ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నటించనున్నారని తాజాగా చిత్రబృందం ప్రకటించింది.

అర్జున్

ఈ మధ్యకాలంలో అర్జున్‌ అటు తమిళ, ఇటు తెలుగు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. 'ఖిలాడి' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తుండగా పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై కోనేరు సత్యనారయణ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రవితేజ ఎంట్రీ గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Last Updated : Jan 30, 2021, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details