Latest Movie Releases on February 11: కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత థియేటర్లలో సినిమా సందడి పెరిగింది. మరోవైపు ఓటీటీలలోనూ కొత్త సినిమాల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం(ఫిబ్రవరి 11న) ప్రేక్షకులను అలరించేందుకు మరికొన్ని కొత్త మూవీస్ సిద్ధమయ్యాయి. అవేంటో చూసేద్దాం..
'ఖిలాడి'గా రవితేజ
ఈ సారి సినీప్రియులకు ఫుల్ కిక్ అందిస్తానంటూ దూసుకొస్తున్నారు కథానాయకుడు రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్మహారాజా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఖిలాడి'. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కథానాయికలు. అర్జున్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'ఎఫ్‌ఐఆర్' కథేంటి?
విష్ణు విశాల్ కథానాయకుడిగా నటిస్తూ, ఆయన స్వయంగా నిర్మించిన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఎఫ్.ఐ.ఆర్'. మను ఆనంద్ దర్శకుడు. కథానాయకుడు రవితేజ సమర్పిస్తున్నారు. అభిషేక్ నామా ఈ మూవీని తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఉగ్రవాదం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ కథలో ఉగ్రదాడికి పాల్పడింది ఎవరు? ద్రోహి అనే ముద్ర ఎవరిపై పడిందనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మంజిమామోహన్, రెబా మోనికాజాన్ తదితరులు నటించారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన చిత్రం 'సెహరి'. అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించారు. కోటి, అభినవ్ గోమఠం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇది కూడా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది.
"ఇదొక చక్కని రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులోని కథ, పాత్రలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటాయి. హర్ష్ కొత్తవాడైనా అనుభవమున్న నటుడిలా చేశారు. ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మించాం. ఈ సినిమా కుటుంబ సమేతంగా వెళ్లి హాయిగా చూడగలిగేలా ఉంటుంది" అని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: అరవింద్ విశ్వనాథ్.
టిల్లు అన్న డీజే కొడితే..
"ఒక ల్యాండ్ ఉన్నది. అది మన సొంతము.. మన పర్సనల్ అనుకున్నా నేను.. కానీ, అది ఊళ్లో వాళ్ల అందరి పేరు పైనా ఉంది" అంటూ నవ్వులు పంచుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'డిజె టిల్లు'. నేహాశెట్టి నాయిక. విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 12న అభిమానులను పలకరించనుంది.
ఇప్పటివరకూ విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, మాటలు: సిద్ధు జొన్నలగడ్డ, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు. వీటితో పాటు 'మహా ప్రళయం-2022' హాలీవుడ్ చిత్రం.. 'రచ్చ రచ్చ' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఓటీటీలో రిలీజ్లు ఇవే..