పెద్ద బంగళా. ఆమె మాటలు రావు, వినిపించదు. ఓ సైకో ఆమెను చంపాలని ప్రయత్నిస్తుంటాడు. చివరకు అతడి నుంచి ఆమె తప్పించుకోగలిగిందా లేదా అనేది తెలియాలంటే 'కామోషి' సినిమా చూడాల్సిందే. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. బధిర యువతి పాత్రలో తమన్నా కనిపించనుండగా, సైకోగా ప్రభుదేవా నటించాడు.
సైకో నుంచి తమన్నా తప్పించుకుంటుందా? - భూమిక
తమన్నా ప్రధాన పాత్రలో రానున్న 'కామోషి' సినిమా ట్రైలర్ విడుదలైంది. హారర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో సైకోగా కనిపించనున్నాడు ప్రభుదేవా.
సైకో నుంచి తమన్నా తప్పించుకుంటుందా..?
భూమిక, సంజయ్ సూరి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. 'ఈనాడు', 'డేవిడ్ బిల్లా' చిత్రాలను తెరకెక్కించిన చక్రి తోలేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: 'ఒక దెయ్యం కాదయ్యా.. రెండు దెయ్యాలు'