తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈసారి అనన్య పాండే.. లైక్​ల కంటే డిస్​లైక్స్ ఎక్కువ - Khalee Peeli trailer dislikes

యువ నటి అనన్య పాండే కొత్త సినిమా ట్రైలర్​కు విపరీతంగా డిస్​లైక్స్ కొడుతున్నారు నెటిజన్లు. ఇటీవలే ఆలియా 'సడక్ 2' చిత్రంపై ఇలానే విరుచుకుపడ్డారు.

Khalee Peeli trailer gets more thumbs down than likes on YouTube
Khalee Peeli trailer

By

Published : Sep 23, 2020, 11:35 AM IST

బాలీవుడ్​లో మరో సినిమాకు నెపోటిజమ్​ సెగ తాకింది. ఇప్పటికే ఆలియా భట్ 'సడక్ 2' చిత్రాన్ని ఓ రేంజ్​లో ట్రోల్ చేసిన నెటిజన్లు.. ఇప్పుడు అనన్య పాండే 'ఖాలీ పీలీ' ట్రైలర్​కు చుక్కలు చూపిస్తున్నారు. లైక్​ల కంటే డిస్​లైక్స్ ఎక్కువగా కొట్టి తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. కామెంట్లలోనూ ఇదే విషయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా విడుదల సమయంలో ఇంకేం చేస్తారో?

జూన్​ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత, బాలీవుడ్​లోని పోటిజమ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కారణం వల్లే సుశాంత్ తనువు చాలించాడని, అందుకే స్టార్స్ కిడ్స్ సినిమాలు బహిష్కరించాలని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్​లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే టీజర్స్, ట్రైలర్స్​కు డిస్​లైక్స్ కొడుతున్నారు.

'ఖాలీ పీలీ'లో ఇషాన్ కట్టర్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. మక్బూల్​ ఖాన్​ దర్శకుడు. కరోనా వల్ల విడుదల వాయిదా పడగా.. అక్టోబరు 2న ఓటీటీలో విడుదల చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details