అద్భుతమైన కథతో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తన నటనతో అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు యశ్. 2018లో అన్ని భాషల్లో విడుదలైన 'కేజీఎఫ్ చాప్టర్ 1'.. అంచనాలకు మించి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
'కేజీఎఫ్' ఖాతాలో మరో రికార్డు - కేజీఎఫ్ సినిమా రికార్డు
కన్నడ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కేజీఎఫ్'. గతేడాదిలో విడుదలై భారీ వసూళ్లు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
'కేజీఎఫ్' ఖాతాలో మరో రికార్డు?
'కేజీఎఫ్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్‌లో.. 2019 సంవత్సరానికి గాను అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న కేజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ జరుపుకొంటోంది. ఈ మూవీలో హిందీ నటుడు సంజయ్ దత్ విలన్ 'అధీరా' పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ మూవీ విడుదలకు సంబంధించిన వివరాలు వెల్లడించనుంది చిత్రబృందం.
ఇవీ చూడండి.. హోరాహోరీ పోరులో బోణీ కొట్టిన టీమిండియా