ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా 'ఆర్ ఆర్ ఆర్'లో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయి కథలతోనే ప్రయాణం చేసేలా ప్రణాళికలు రూపొందించాడు. ఆ దిశగా ఇప్పటికే 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పిన కథకి పచ్చజెండా ఊపాడు.
కేజీఎఫ్ దర్శకుడితో జూ.ఎన్టీఆర్ సినిమా - ఎన్టీఆర్ కేజీఎఫ్ దర్శకుడుతో సినిమా
జూ.ఎన్టీఆర్ తర్వాత సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్టును మైత్రీమూవీ మేకర్స్ నిర్మించనుంది.
ప్రస్తుతం ప్రశాంత్ 'కేజీఎఫ్ 2' తెరకెక్కిస్తున్నాడు. అది విడుదలైన తర్వాత ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కుతుంది. పలు భాషల్ని లక్ష్యంగా చేసుకుని రూపొందనున్న పాన్ ఇండియా సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. 'ఆర్ ఆర్ ఆర్' పూర్తయిన వెంటనే, త్రివిక్రమ్ సినిమా కోసం రంగంలోకి దిగుతాడు ఎన్టీఆర్. దాని తర్వాతే ప్రశాంత్ నీల్‌తో సినిమా పట్టాలెక్కుతుందని నిర్మాణ సంస్థ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్టు వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.