తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కేజీఎఫ్‌ 2' శాటిలైట్‌ హక్కులకు క్రేజ్​ మామూలుగా లేదు! - కేజీఎఫ్​ 2 వార్తలు తాజా

కేజీఎఫ్​ 2 శాటిలైట్​ హక్కుల్ని ప్రముఖ సంస్థ 'జీ' భారీ మొత్తానికి కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని యశ్​ ​వెల్లడించారు. ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌, రావు రమేశ్‌, రవీనా టాండన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

kgf 2 satellite rights
'కేజీఎఫ్‌ 2' శాటిలైట్‌ హక్కులు ఎవరు దక్కించుకున్నారంటే?

By

Published : Aug 20, 2021, 8:42 PM IST

యశ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2'. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. గతంలో వచ్చిన 'కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 1' కి కొనసాగింపుగా రూపొందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టు శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ సంస్థ 'జీ' భారీ మొత్తానికి కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తి చేశారు యశ్‌.

'దక్షిణాది భాషలకు సంబంధించి కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 శాటిలైట్‌ హక్కుల్ని 'జీ' సొంతం చేసుకుందని తెలియజేస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని పేర్కొన్నారు. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. సంజయ్‌ దత్‌, రావు రమేశ్‌, రవీనా టాండన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అతి త్వరలోనే ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఇదీ చదవండి :ఆ హిట్‌ రీమేక్‌లో హీరోగా బండ్ల గణేశ్‌!

ABOUT THE AUTHOR

...view details