తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కేజీఎఫ్​ 2' విడుదలయ్యేది అప్పుడే - యశ్​ ప్రశాంత్​ నీల్

స్టార్​ హీరో యశ్​, దర్శకుడు ప్రశాంత్​ నీల్ కాంబినేషన్​లో రూపొందుతోన్న చిత్రం 'కేజీఎఫ్​ 2'. ఇటీవల విడుదల ఈ సినిమా టీజర్​ సోషల్​మీడియాలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై శుక్రవారం చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ​

KGF Chapter 2 movie release date announced
'కేజీఎఫ్​ 2' విడుదలయ్యేది అప్పుడే

By

Published : Jan 29, 2021, 6:43 PM IST

Updated : Jan 29, 2021, 6:50 PM IST

టీజర్‌తోనే భారతీయ సినిమా ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించిన చిత్రం 'కేజీయఫ్‌: చాప్టర్‌2'‌. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. యావత్‌ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించింది. జులై 16వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.

దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. సంజయ్‌దత్‌, రవీనా టాండన్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో 'కేజీయఫ్‌: చాప్టర్‌2' విడుదల కానుంది.

టీజర్​తో రికార్డులు

యశ్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ యూట్యూబ్​లో రికార్డులు బద్దలు కొడుతోంది. జనవరి 7న టీజర్​ను విడుదల చేయగా, అతి తక్కువ సమయంలో 100 మిలియన్‌ వ్యూస్‌ను దాటిన ఘనత సాధించింది. ప్రస్తుతం 163 మిలియన్ల వీక్షణలకు చేరుకోగా.. 7.8 మిలియన్లకు పైగా లైక్స్‌ సొంతం చేసుకుంది.

ఆ ప్రశ్నలన్నిటీకీ సీక్వెల్​తో సమాధానం

తొలి భాగంలో మిగిలిన అనేక ప్రశ్నలకు 'కేజీఎఫ్ 2' సమాధానం లభించనుంది. గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాకీ.. ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీఎఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? గరుడ వేసిన ప్లాన్‌ ప్రకారం చనిపోయిన అధీరా ఎలా తిరిగొచ్చాడు? భారత దేశంలోకి ప్రవేశించడానికి ఇనాయత్‌ ఖలీద్​ ఏం చేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాకీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇదీ చూడండి:మెగాస్టార్​ 'ఆచార్య' టీజర్​ వచ్చేసిందోచ్​!

Last Updated : Jan 29, 2021, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details