తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్​ సరసన 'కేజీఎఫ్​' బ్యూటీ! - ప్రభాస్​ వార్తలు

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్​ నీల్​ కాంబినేషన్​లో 'సలార్' చిత్రం రూపొందుతోంది. ఇందులో ఓ ప్రత్యేక గీతం కోసం 'కేజీఎఫ్'​ బ్యూటీ శ్రీనిధి శెట్టిని సంప్రదించినట్లు సమాచారం. ఈ బంపర్​ ఆఫర్​కు ఆమె అంగీకరించిందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

KGF beauty to dance for a special number with Prabhas?
ప్రభాస్​ సరసన 'కేజీఎఫ్​' బ్యూటీ!

By

Published : Mar 17, 2021, 9:16 AM IST

Updated : Mar 17, 2021, 9:25 AM IST

ప్రభాస్‌ 'సలార్‌' చిత్రంలో శ్రీనిధి శెట్టి కనిపించనుందా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అయితే ఆమె పోషించేది ప్రత్యేక పాత్రో, అతిథి పాత్రో కాదట. ఓ ప్రత్యేక గీతంలో ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేయబోతోందని తెలుస్తోంది. పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌కి చోటుందని.. ఈ మేరకు చిత్ర బృందం నిధిని సంప్రదించినట్టు కన్నడ మీడియాలో టాక్‌ నడుస్తోంది. ప్రభాస్‌ పక్కన ఆడిపాడేందుకు నిధి ఆసక్తి చూపుతోందని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతి హాసన్‌ నాయిక. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం 2021 ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. కన్నడ నటుడు యశ్‌ హీరోగా వచ్చిన 'కేజీఎఫ్ ఛాప్టర్‌ 1‌' చిత్రాన్ని ప్రశాంత్‌ నీలే తెరకెక్కించారు. దానికి కొనసాగింపుగా 'కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2' రాబోతోంది.

ఇదీ చూడండి:కొవాగ్జిన్​ టీకా తీసుకున్న అక్కినేని నాగార్జున

Last Updated : Mar 17, 2021, 9:25 AM IST

ABOUT THE AUTHOR

...view details