కథానాయకుడు ప్రభాస్ నుంచి రానున్న పాన్ ఇండియా చిత్రాల్లో 'సలార్' కూడా ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకుడు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. త్వరలో మరో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు.
ఇందులో భాగంగా ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడీ పాట కోసం కన్నడ తార శ్రీనిధి శెట్టిని ఎంపిక చేశారని సమాచారం. ఆమె ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్'తోనే నాయికగా తెరపై అరంగేట్రం చేసింది.