'కేజీఎఫ్ 2' క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయ్యింది. హీరో యశ్‌తో పాటు సంజయ్‌దత్ కూడా పాల్గొన్నాడు. తాజాగా క్లైమాక్స్‌ను పూర్తి చేసుకున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్లో వెల్లడించాడు. షూటింగ్‌లోని ఓ చిత్రాన్ని షేర్ చేస్తూ.. ఈ చిత్రీకరణ తనకెంతో ఆనందాన్నిచ్చిందని తెలిపాడు. సంజయ్ దత్, యశ్‌లపై ప్రశంసలు కురిపించాడు.
'కేజీఎఫ్' క్లైమాక్స్ పూర్తి.. దర్శకుడి ఆనందం - కేజీఎఫ్ 2 షూటింగ్లో సంజయ్ దత్
సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'కేజీఎఫ్ 2'. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. ఈ చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్‌ను పూర్తి చేసినట్లు తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్లో వెల్లడించాడు.
'కేజీఎఫ్' క్లైమాక్స్ పూర్తి.. యశ్, సంజులపై దర్శకుడు ప్రశంసలు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీరా అనే ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది చిత్రబృందం. 'కేజీఎఫ్: చాప్టర్ 1' 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చి విశేషాదరణ దక్కించుకుంది.
ఇదీ చూడండి:''ఆచార్య'లో ఆ సీన్ రీషూట్ చేశాం'