కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'కేజీఎఫ్: ఛాప్టర్ 1' బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించడం వల్ల సీక్వెల్‌పై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ ఏడాది విజయదశమి సందర్భంగా కేజీఎఫ్ సీక్వెల్‌ను విడుదల చేయాలని నిర్ణయించినా.. కరోనా కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
'కేజీఎఫ్ 2' టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్! - Hero yash news
హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా 'కేజీఎఫ్: చాప్టర్ 2' టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. జనవరి 8న టీజర్‌తో పాటు చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
'కేజీఎఫ్ 2' టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్!
'కేజీఎఫ్: చాప్టర్ 2' షూటింగ్ ఇప్పటికే తుది షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకొంటుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయనున్నారని సమాచారం. దీంతో పాటు అదే రోజున హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌తో పాటు చిత్ర విడుదల తేదీనీ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.