KGF 2 Release Date: 2018లో విడుదలైన 'కేజీఎఫ్' తొలి భాగం.. దేశవ్యాప్తంగా విడుదలై, అన్ని భాషల ప్రేక్షకుల్ని మెప్పించింది. కేజీఎఫ్ పార్ట్ 2ను ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఆ వివరాల్ని మార్చి3న చెప్తామని కేజీఎఫ్ చిత్రబృందం వెల్లడించింది. మరి ఆ అప్డేట్ విశేషాలేంటో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగక తప్పదు.
తొలి భాగంలో మిగిలిన అనేక ప్రశ్నలకు 'కేజీఎఫ్ 2' సమాధానం లభించనుంది. గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాకీ.. ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీఎఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్, కమల్, గురు పాండ్యన్, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? గరుడ వేసిన ప్లాన్ ప్రకారం చనిపోయిన అధీరా ఎలా తిరిగొచ్చాడు? భారత దేశంలోకి ప్రవేశించడానికి ఇనాయత్ ఖలీ ఏం చేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాకీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
విక్రమ్ షూటింగ్ పూర్తి..
Vikram Movie Release Date: లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న 'విక్రమ్' చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ మేరకు చిత్రబృందం ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో విజయ్‌సేతుపతి విలన్‌గా, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలో నటిస్తున్నారు.