తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యశ్​ తర్వాతి సినిమా ఆ బ్యానర్​లోనేనా? - yash yash raj films

కన్నడ స్టార్​ హీరో యశ్​తో సినిమా చేసేందుకు బాలీవుడ్​ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్​ రాజ్​ ఫిల్మిమ్స్​ ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. యశ్​ నటించిన 'కేజీఎప్​ 2' జులై 16న విడుదల కానుంది.

yash
యశ్​

By

Published : Mar 6, 2021, 10:27 PM IST

'కేజీఎఫ్'​తో కన్నడ స్టార్​ హీరో యశ్​కు దేశవ్యాప్తంగా క్రేజ్ అమాంతం​ పెరిగిపోయింది. దీంతో జులై 16న విడుదల కానున్న​'కేజీఎఫ్​ 2' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని తర్వాత యశ్​.. ఏ సినిమా, ఎవరితో చేయనున్నారా అని ఇప్పటి నుంచే ఫ్యాన్స్​లో ఆసక్తి నెలకొంది.

మరోవైపు ఆయనతో సినిమా చేసేందుకు పలువురు దర్శక నిర్మాతలు వరుసగా క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్​ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్​రాజ్​ ఫిల్మిమ్స్​.. తమ బ్యానర్​లో యశ్​తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆయనతో చర్చలు కూడా జరుపుతున్నారట. అంతకముందు హీరో ప్రభాస్​తో సినిమా చేయాలని ఈ సంస్థ ప్రయత్నాలు చేసినా.. అది కుదరలేదు. మరి యశ్​తోనైనా సినిమా చేస్తుందో చూడాలి.

ఇదీ చూడండి: 'సలార్' లాంచ్ ఫొటోలు: డార్లింగ్ ప్రభాస్​తో యష్

ABOUT THE AUTHOR

...view details