తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కేజీఎఫ్' అధీరా కొత్త పోస్టర్.. టాలీవుడ్​లోకి వేణు రీఎంట్రీ - raviteja ramarao venu thottempudi

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో కేజీఎఫ్ 2, రామారావు, మహాసముద్రం, తడమ్ హిందీ రీమేక్, ఒరేయ్ బామ్మర్ది, కురుతి చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates latest
మూవీ అప్డేట్స్

By

Published : Jul 29, 2021, 10:45 AM IST

*స్టార్ నటుడు సంజయ్​దత్ పుట్టినరోజు సందర్భంగా 'కేజీఎఫ్ 2'లోని ఆయన కొత్త పోస్టర్​ను విడుదల చేశారు. ఇందులో అధీరా అనే భయంకరమైన విలన్​గా సంజయ్​దత్ కనిపించనున్నారు. యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం.. సెప్టెంబరు తొలి వారంలో థియేటర్లలోకి రానుందట.

.

*నటుడు వేణు.. మళ్లీ తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ 'దమ్ము'లో చివరగా కనిపించిన ఆయన.. ఇప్పుడు రవితేజ 'రామారావు' సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ మేరకు చిత్రబృందం గురువారం ప్రకటించింది. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.

.

*శర్వానంద్, సిద్ధార్థ్ మల్టీస్టారర్ సినిమా 'మహాసముద్రం'. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, త్వరలో అప్డేట్స్​ వరుసగా రానున్నాయని ప్రకటించారు. మోషన్​ పోస్టర్​ను గురువారం విడుదల చేశారు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు. అదితీరావ్ హైదరీ, అను ఇమ్యాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు.

*తమిళ హిట్​ 'తడమ్' రీమేక్​గా వచ్చిన 'రెడ్' తెలుగులో అలరించగా, ఇప్పుడు హిందీలోనూ రీమేక్​కు రంగం సిద్ధమైంది. ఆదిత్య కపూర్ కథానాయకుడిగా దీనిని రీమేక్ చేయనున్నట్లు ప్రకటించారు. వర్ధన్ కేట్కర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సెప్టెంబరు నుంచి చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు.

.

*సిద్ధార్థ్-జీవీ ప్రకాశ్ నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం 'ఒరేయ్ బామ్మర్ది' ఆగస్టు 13న విడుదల కానుంది. పృథ్వీరాజ్ హీరోగా నటించిన మలయాళ సినిమా 'కురుతి'.. ఓనం కానుకగా ఆగస్టు 11న అమెజాన్ ప్రైమ్​ వీడియోలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

.
.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details