తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కేరళ హైకోర్టు తీర్పు.. సన్నీకి తప్పిన అరెస్టు - Sunny Leone cheating case

చీటింగ్ కేసులో భాగంగా సన్నీ లియోనీని కేవలం విచారించాలని, అరెస్టు చేయొద్దని కేరళ హైకోర్టు, క్రైమ్​ బ్రాంచ్​ను అదేశించింది. గతకొద్ది రోజుల నుంచి ఈ కేసు విచారణ సాగుతోంది.

Kerala HC restrains Sunny Leone's arrest in connection with alleged financial fraud
కేరళ హైకోర్టు తీర్పు.. సన్నీ లియోనీకి తప్పిన అరెస్టు

By

Published : Feb 10, 2021, 2:02 PM IST

బాలీవుడ్​ బ్యూటీ సన్నీ లియోనీని అరెస్టు చేయకూడదని కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చీటింగ్ కేసులో భాగంగా పోలీసుల నుంచి ఇటీవల ప్రశ్నలు ఎదుర్కొన్న సన్నీ.. ముందస్తు బెయిల్​ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం ఇలా తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆమెను కేవలం విచారించాలని స్పష్టం చేసింది.

అసలేం జరిగింది?

కేరళకు చెందిన ఓ ఈవెంట్​ సంస్థతో సన్నీ లియోనీ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2016 నుంచి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలి. దీనికోసమే ఆమెకు రూ.29 లక్షలు కూడా ఇచ్చారు. అయితే తమ దగ్గర డబ్బులు తీసుకుని, ఈవెంట్లకు సన్నీ హాజరు కాలేదని ఈవెంట్​ మేనేజర్ శియాస్, కేరళ డీజీపీకి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమెను విచారించిన పోలీసులు, వాంగ్మూలం తీసుకున్నారు.

అయితే ఈ విషయంలో తన తప్పు ఏం లేదని సన్నీ చెబుతోంది. ఈవెంట్ ఆర్గనైజర్ అబద్ధాలు ఆడుతున్నాడని తెలిపింది. కార్యక్రమాలు జరిగే తేదీల గురించి సరిగ్గా చెప్పకపోవడం వల్ల చాలాసార్లు మిగతా ప్రాజెక్టుల షెడ్యూల్స్ మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పింది. తనకు రావాల్సిన డబ్బు కూడా వారు సకాలంలో చెల్లించలేదని సన్నీ స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details