కేరళ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది! ఇప్పటివరకు ప్రైవేట్ సంస్థలు మాత్రమే నిర్వహిస్తున్న ఓటీటీ తరహా మాధ్యమాన్ని ప్రభుత్వమే త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్ ఓ టీవీ ఛానల్లో వెల్లడించారు. అలాగే టీవీ ప్రోగ్రామ్స్, సీరియళ్లను సెన్సార్ పరిధిలోకి తీసుకురానున్నామని చెప్పారు.
సొంత ఓటీటీ ఆలోచనలో కేరళ ప్రభుత్వం! - movie news
ఇటీవల ఎన్నికైన కేరళ కొత్త ప్రభుత్వం సరికొత్త ఆలోచనలతో ప్రజల ముందుకు వస్తోంది. ఇందులో భాగంగానే సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది!
saiji cherian
కరోనా ప్రభావంతో మలయాళ చిత్రపరిశ్రమ నష్టాల్లో ఉందని, దీనిని చాలా తీవ్రంగా పరిశీలిస్తున్నామని చెరియన్ పేర్కొన్నారు. నిర్మాతలే కాకుండా కళాకారులందరూ ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. వారందరికీ సహాయపడేలా ఓ కొత్త ప్రాజెక్టును అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.