ప్రముఖబాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. ట్విట్టర్లో ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు. ఇప్పుడిది వైరల్‌గా మారింది. అందులో హిట్ జోడి షారుఖ్-కాజోల్‌ను అనుకరించింది కెన్యాకు చెందిన ఓ జంట.
బాలీవుడ్ చిత్రం 'దిల్వాలే దుల్హానియా లే జాయేంగే' చిత్రంలోని 'తుజే దేఖా తోయి జానా సనమ్' పాటకు లిప్ సింక్ ఇచ్చిందీ జంట. ఈ సినిమాలో కాజోల్కు తండ్రిగా నటించాడు అనుపమ్ ఖేర్. అయితే ఈ పాటకు సంగీతమందించిన లలిత్ పండిట్.. ఈ వీడియోను షేర్ చేసినట్లు తెలిపాడీ నటుడు.