తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కీర్తి 'మిస్‌ ఇండియా' వచ్చేది అప్పుడే..! - keethi suresh miss India updates

కీర్తి సురేష్ హీరోయిన్​గా తెరకెక్కుతోన్న చిత్రం 'మిస్ ఇండియా'. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా విడుదల తేదీపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ విషయమై ఓ వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

కీర్తి
కీర్తి

By

Published : Feb 1, 2020, 5:52 AM IST

Updated : Feb 28, 2020, 5:54 PM IST

'మహానటి' చిత్రంతో కీర్తి సురేష్‌ పేరు మారుమోగిపోయింది. ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా సంపాదించింది. ప్రస్తుతం కీర్తి.. నరేంద్ర నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మిస్‌ ఇండియా' చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌ పూర్తయింది. కానీ విడుదల తేదీని ప్రకటించలేదు. తాజాగా దీనిపై ఓ వార్త చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది.

ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమయ్యే ఈ సినిమాను మార్చి 6న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారట. అమెరికాలో మాత్రం మార్చి 5న ప్రిమియర్‌ షో ప్రదర్శించనున్నట్లు సినీ వర్గాల నుంచి వినిపిస్తోన్న సమాచారం. తమన్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో జగపతిబాబు, నవీన్‌ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నదియా, నరేష్‌ భానుశ్రీ మెహ్రా, పొన్నాడ పూజిత, కమల్‌ కామరాజు తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది.

ఇవీ చూడండి.. పవన్‌ కోసం తాజ్‌ మహల్, చార్మినార్‌..?

Last Updated : Feb 28, 2020, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details