తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ అవార్డు అమ్మకు అంకితమిస్తున్నా: కీర్తి సురేశ్ - BEST ACTRESS

తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు రావడంపై ఆనందం వ్యక్తం చేసిన కీర్తి సురేశ్.. దీనిని అమ్మకు అంకితమిస్తున్నానని చెప్పింది.

జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్

By

Published : Aug 9, 2019, 6:24 PM IST

ఈ అవార్డు అమ్మకు అంకితమిస్తున్నా: కీర్తి సురేశ్

66వ జాతీయ సినీ పురస్కారాల్లో అలనాటి సావిత్రి బయోపిక్​ 'మహానటి'.. ఉత్తమ నటి, ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్​ విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. అనంతరం ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేసింది సావిత్రి పాత్రధారి కీర్తిసురేశ్.

"చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. చిత్రబృందం మొత్తానికి ధన్యవాదాలు. వారు లేకుండా ఈ ఘనత సాధ్యం కాదు. ఇది నా జీవితంలో అత్యుత్తమ అనుభూతి. అమ్మ మేనకకు తొలి మలయాళం సినిమాకు జాతీయ అవార్డు రావాల్సింది. కానీ కొద్దిలో చేజారిపోయింది. అందుకే ఈ పురస్కారాన్ని ఆమెకు అంకితం ఇస్తున్నా" -కీర్తి సురేశ్, జాతీయ ఉత్తమ నటి, హీరోయిన్

'మహానటి'లో అద్భుతంగా నటించిన కీర్తి సురేశ్.. ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఇందులో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత ఇతర పాత్రల్లో కనిపించారు. మిక్కీ జే మేయర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. వైజయంతీ మూవీస్ నిర్మాతగా వ్యవహరించింది.

'మహానటి' పురస్కారాల పంట

ఇది చదవండి: జాతీయ సినీ అవార్డుల్లో విభిన్న చిత్రాలదే హవా

ABOUT THE AUTHOR

...view details