Keerthy Suresh Udhayanidhi Movie: దక్షిణాదిలో వరుస చిత్రాలతో జోరు చూపిస్తోంది నటి కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె నటించిన 'గుడ్ లక్ సఖి' విడుదలకు సిద్ధమవుతుండగా 'సర్కారు వారి పాట', 'భోళా శంకర్', 'సాని కాయిదం' సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. తాజాగా ఇప్పుడామె జాబితాలో మరో చిత్రం చేరినట్లు తెలిసింది. తమిళ కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది.
కీర్తిసురేష్-స్టాలిన్ కొత్త సినిమా.. కీలక పాత్రలో ఫహాద్ ఫాజిల్! - ఉదయనిధి స్టాలిన్ కొత్త సినిమా
Keerthy Suresh Udhayanidhi Movie: వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్ నటిస్తున్నారు. మలయాళ స్టార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
![కీర్తిసురేష్-స్టాలిన్ కొత్త సినిమా.. కీలక పాత్రలో ఫహాద్ ఫాజిల్! udhayanidhi stalin upcoming movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14088436-thumbnail-3x2-img.jpg)
కీర్తి సురేష్ కొత్త సినిమా
గత వేసవిలోనే సెట్స్‌పైకి వెళ్లాల్సిన ఈ సినిమా.. ఉదయనిధి ఎన్నికల్లో పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలవడం వల్ల ఆలస్యమైంది. ఇప్పుడీ చిత్రం కోసం కథానాయికగా కీర్తిని ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే సంగీత దర్శకుడిగా ఏఆర్.రెహమాన్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ఈనెలలోనే ప్రారంభం కానున్నట్లు తమిళ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇదీ చదవండి:'ఆచార్య' నుంచి 'సానా కష్టం' సాంగ్.. చిరు స్టెప్పులు సూపరంతే!