తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కీర్తి వీడియో చూసి షాకైన ఫ్యాన్స్

నటి కీర్తి సురేశ్ తాజాగా ఓ వీడియోను నెట్టింట షేర్ చేసింది. అయితే ఆ వీడియోలో కీర్తి చాలా సన్నగా కనపించింది. దీంతో అభిమానులు షాక్​కు గురయ్యారు.

Keerthy suresh u are becoming very thin fans comment
కీర్తి వీడియో చూసి షాకయిన ఫ్యాన్స్

By

Published : Oct 3, 2020, 5:27 AM IST

'మహానటి' సావిత్రిగా మెప్పించి జాతీయ అవార్డు అందుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేశ్‌. ఇటీవల 'పెంగ్విన్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ఇప్పుడు 'రంగ్‌ దే', 'అన్నాత్తె'లో నటిస్తోంది. తాజాగా షూటింగ్‌ బ్రేక్‌లో తీసుకున్న ఓ వీడియోను ఆమె సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. కాఫీ తనలో కొత్త ఉత్సాహం నింపుతుందని, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కచ్చితంగా కప్పు కాఫీ తాగుతానని తెలిపింది.

అయితే.. వీడియోలో కీర్తిని చూసిన ఫాలోవర్స్‌ షాక్‌ అయ్యారు. కీర్తి అందులో చాలా సన్నగా కనిపించడమే అందుకు కారణం. "దయచేసి మళ్లీ బరువు పెరుగు కీర్తి, చాలా సన్నబడ్డావు, ఇలా మారిపోయావ్‌ ఏంటి?.." అంటూ రకరకాల కామెంట్లు చేశారు. అయితే కొందరు మాత్రం ఆమె ఇలానే బాగున్నారని పోస్ట్‌లు చేశారు. దీంతో కీర్తి వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కీర్తి సురేశ్‌ కొన్ని నెలలుగా తెగ కసరత్తులు చేస్తోంది. గతంతో పోల్చితే చాలా సన్నబడింది. ఈ క్రమంలో తీసిన ఫొటోలు ఇప్పటికే వైరల్‌ అయ్యాయి. కానీ తాజా వీడియోలో ఆమె మరింత స్లిమ్‌గా కనిపించింది.

ABOUT THE AUTHOR

...view details