తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పారితోషికం తగ్గించుకున్న కీర్తి సురేశ్!

లాక్​డౌన్ కారణంగా నిర్మాతలపై పడ్డ భారాన్ని తగ్గించడానికి పలువురు నటీనటులు ముందుకొస్తున్నారు. తాజాగా కథానాయిక కీర్తి సురేశ్​ తన పారితోషికం నుంచి 20-30 శాతాన్ని తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారట.

Keerthy Suresh ready to reduce her Remuneration
కీర్తి సురేశ్

By

Published : Jun 17, 2020, 12:55 PM IST

లాక్​డౌన్ కారణంగా మూసేసిన థియేటర్లు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చిన్న బడ్జెట్‌ సినిమాల్ని నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 'అమృతరామమ్‌', 'పొన్‌మగళ్‌ వందాళ్‌', 'గులాబో సితాబో' విడుదలయ్యాయి. నిర్మాతలపై పడ్డ భారాన్ని తగ్గించడానికి పలువురు నటీనటులు పారితోషికం తగ్గించుకున్నారు. మిగిలిన వారు కూడా కొంత శాతం రెమ్యునరేషన్​ తగ్గించుకుని.. నిర్మాతలకు చేయూతగా ఉండాలని కోరారు.

ఈ కోవలోనే కథానాయిక కీర్తి సురేశ్‌ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాతలకు సాయంగా ఉండేందుకు ఆమె ముందుకు వచ్చారు. ముందుగా మాట్లాడుకున్న పారితోషికం నుంచి 20-30 శాతం తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారట. ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి.

కీర్తి సురేశ్‌ నటించిన 'పెంగ్విన్‌' సినిమా మరో రెండు రోజుల్లో అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఆమె చేతిలో ప్రస్తుతం 'మిస్‌ ఇండియా', 'గుడ్‌ లక్‌ సఖి', 'రంగ్‌దే', 'మరక్కర్', 'అన్నాత్తే' ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details