ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్.. త్వరలో ఓ తమిళ చిత్రంలో నటించనుంది. కార్తీక్ సుబ్బరాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభంకానుంది. ఇదొక భావోద్వేగంతో కూడిన థ్రిల్లర్ కథ. సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడు.
సెప్టెంబర్‌లో కీర్తి సురేష్ కొత్త చిత్రం షురూ! - etvbharat
'మహానటి' చిత్రంలో నటనకు జాతీయ అవార్డు పొందిన కథానాయిక కీర్తి సురేష్. ఇటీవల నాగార్జున హీరోగా తెరకెక్కిన 'మన్మథుడు 2' చిత్రంలో కనిపించిందీ అందాల భామ. తాజాగా కార్తీక్ సుబ్బరాజు నిర్మాణంలో ఓ తమిళ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సెప్టెంబర్‌లో కీర్తి సురేష్ కొత్త చిత్రం ప్రారంభం
ప్రస్తుతం మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి 'మరక్కర్: అరబికడాలింతే సింహం'లో నటిస్తోంది కీర్తి. హిందీలో అమిత్ శర్మ దర్శకత్వంలో వస్తోన్న చిత్రంలో అజయ్ దేవగణ్ సరసన కనిపించనుంది. ఈ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెడుతోంది.
ఇవీ చూడండి...నెటిజన్లపై నిత్యామీనన్‌కు చాలా కోపమొచ్చింది!
Last Updated : Sep 26, 2019, 9:27 PM IST