తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పుట్టినరోజున హీరోయిన్ కీర్తి సురేష్ కానుక - keerthy suresh latest news

'మహానటి' సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్​... నేడు 28వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కొత్త సినిమాలోని ఆమె లుక్​ను విడుదల చేశారు.

28వ పడిలోకి కీర్తి సురేష్​... ఆకర్షణీయ లుక్​తో సందడి

By

Published : Oct 17, 2019, 10:45 AM IST

Updated : Oct 17, 2019, 1:23 PM IST

కథానాయిక కీర్తి సురేష్​ మరో కొత్త వసంతంలోకి అడుగుపెట్టింది. విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచిన ఈ జూనియర్​ సావిత్రి... మరోసారి నాయికా ప్రాధాన్య చిత్రంలో కనువిందు చేయనుంది. ఇటీవలే కొత్త ప్రాజెక్టును ఖరారు చేసిన చిత్రబృందం.. నేడు కీర్తి పుట్టినరోజు సందర్భంగా ఓ లుక్​ను విడుదల చేసింది.

ఈ చిత్రంలో ఆమెతో పాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వర్త్‌ ఎ షాట్‌ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్‌ దర్శకుడు నగేశ్‌ కుకునూర్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయవుతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూర్చుతున్నాడు. వచ్చే నెల 11 నుంచి హైదరాబాద్‌లో చివరి దశ చిత్రీకరణ జరగనుంది. స్పోర్ట్స్‌, రొమాన్స్‌, కామెడీ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్ర ఫస్ట్​లుక్​ దీపావళికి విడుదల కానుంది.

కొత్త లుక్​లో కీర్తి

'మహానటి' తర్వాత కీర్తి సురేశ్‌ నేరుగా తెలుగులో నటించలేదు. 2018లో తమిళంలో ఆమె నటించిన 'సీమరాజా', 'స్వామి 2', 'పందెం కోడి 2', 'సర్కార్‌' సినిమాలు విడుదలై మంచి టాక్‌ అందుకున్నాయి. ప్రస్తుతం ఆమె మలయాళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేయబోతోంది. అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు.

ఆసక్తికర విశేషాలు....

  • తమిళం, మలయాళంపై మంచి పట్టున్న కీర్తి... 'మహానటి' సినిమా తెలుగు డబ్బింగ్​ చెప్పేటప్పుడు బాగా ఇబ్బందిపడిందట. మొదటిసారి ఈ చిత్రం ద్వారానే తెలుగు తెరపై తన ఒరిజినల్​ గాత్రాన్ని వినిపించింది.
  • స్విమ్మింగ్​లో మంచి ప్రావీణ్యం కీర్తి సొంతం. పాఠశాల స్థాయిలోనే ఈ క్రీడలో చాలా సార్లు ఛాంపియన్​గా పతకాలు అందుకుందట.
  • ఈ నటి ఆరోగ్య, సౌందర్య రహస్యం శాకాహారమేనట. ప్రతిరోజు కొంత సమయం కచ్చితంగా ఫిట్​నెస్​ కోసం కేటాయిస్తుంది.
  • సినిమాల్లోకి రాకముందు చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థలో ఫ్యాషన్​ డిజైనర్​గా పనిచేసిందీ యువనటి. స్కాట్లాండ్​ వెళ్లి ఓ డిజైనింగ్​ కోర్సు కూడా నేర్చుకుంది. నటన వైపు వెళ్లకపోతే ఇదే రంగంలో స్థిరపడేదట.

మలయాళ చిత్రం 'పైలట్'తో తొలిసారి బాలనటిగా కనిపించింది కీర్తి సురేష్​. 2000లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంది విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కుబేరన్​, అచనేయ నేనికిస్టమ్​ అనే సినిమాలో కనిపించింది. ఈ మూడు సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. అలా చిన్నప్పుడే హ్యాట్రిక్​ విజయాలు అందుకుంది కీర్తి.

Last Updated : Oct 17, 2019, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details