'గుడ్ లక్ సఖి' ప్రమోషన్లో కీర్తి Keerthy Suresh: అకారణంగా అమ్మాయిలపై వేసే అభాండాలను తానూ ఎదుర్కొన్నట్లు చెప్పింది కీర్తి సురేశ్. కెరీర్ తొలినాళ్లలో షూటింగ్, రిలీజ్‌లకు కలిగే అడ్డంకులకు తనను నిందించేవారని వెల్లడించింది. తాజాగా తాను నటించిన కొత్త సినిమా 'గుడ్‌లక్ సఖి'. ఈ చిత్రం జనవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ చిత్ర దర్శకుడు నగేశ్ కుకునూర్‌తో తన జర్నీ ఎలా సాగిందో వివరించింది.
"నగేశ్ సర్‌తో జర్నీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. షూట్ అయ్యాక మానిటర్లో చూడటానికి వెళ్తే.. 'ఏం చూస్తున్నావు?' అని అడిగేవారు.. జుట్టు, మేకప్ అని చెప్పేదాన్ని.. 'మరి పెర్ఫామెన్స్ సంగతేంటి?' అనేవారు. అప్పుడిక మానిటర్ చూడాల్సిన అవసరం లేదనుకున్నా. ఆయన కళ్లలోకి చూసి అర్థం చేసుకునేదాన్ని."
- కీర్తి సురేశ్, నటి
ప్రేమకు సమయం లేదు..
'గుడ్ లక్ సఖి' కోసం రాయలసీమ యాస నేర్చుకున్నట్లు తెలిపింది కీర్తి. డబ్బింగ్ చెప్పి, బయటకు వచ్చాక కూడా అదే యాసలోనే తాను మాట్లాడేదానని తెలిపిందామె. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బాయ్‌ఫ్రెండ్, ప్రేమకు సమయం లేదని అంటోంది.
గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేటకు జనవరి 28న విడుదలకానుంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో మెరవనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సుధీర్‌చంద్ర పాదిరి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తుండటం విశేషం.
ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చెర్రీ..
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా చరణ్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం 6 గంటలకు పార్క్ హయత్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా హాజరుకానున్నారు. తొలుత ఈ వేడకకు మెగాస్టార్ చిరంజీవి హాజరుకావాల్సి ఉండగా, కరోనా సోకడం కారణంగా రాలేకపోతున్నారు.
ఇదీ చూడండి:'రాధేశ్యామ్' రిలీజ్.. ఓటీటీ లేదా థియేటర్లోనా?