'నేను శైలజా'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. అలనాటి తార సావిత్రి బయోపిక్ 'మహానటి'తో ఆమెకు మంచి స్టార్‌డమ్ లభించింది. కమర్షియల్ సినిమాలతో కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతోనూ అలరిస్తున్న కీర్తి నటించిన 'మిస్ ఇండియా' చిత్రం.. బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరేంద్రనాథ్ దర్శకత్వం వహించగా, మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఇవి..
క్వారంటైన్‌లో ఏం నేర్చుకున్నారు?
కీర్తి సురేశ్: చిన్న చిన్న విషయాల్లోనూ సంతోషాన్ని వెతకడం.
మీరు బరువు తగ్గడం వెనుక రహస్యం ఏంటి?
కీర్తి సురేశ్: వర్కౌట్స్ చేయడం, డైట్ పాటించడం.
మీ డ్రీమ్ ఏంటి?
కీర్తి సురేశ్: ఇప్పుడు నేను నా డ్రీమ్‌తోనే (నటిస్తూ) జీవిస్తున్నా.
నెగటివిటీ, ట్రోల్‌ను ఎలా ఎదుర్కొంటారు?
కీర్తి సురేశ్: వాటిని పట్టించుకోను.
మీరు పాన్ ఇండియా చిత్రంలో ఎప్పుడు నటిస్తారు?
కీర్తి సురేశ్: త్వరలోనే అది జరుగుతుందని ఆశిస్తున్నా.
మీ కెరీర్‌లో మీకు నచ్చిన విషయం?
కీర్తి సురేశ్: సరికొత్త ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం. దాంతోపాటు అభిమానులు చూపించే ప్రేమ కూడా..
సాధారణంగా మీరు మీ ఫోన్‌ను ఓపెన్ చేసిన తర్వాత మొదట ఏం చేస్తారు?
కీర్తి సురేశ్: అన్‌లాక్ చేస్తా (నవ్వుతూ)
మీకు హారర్ సినిమాలంటే ఇష్టమా? లేక కామెడీ చిత్రాలా?
కీర్తి సురేశ్: హారర్ సినిమాలు చూడటం, కామెడీ సినిమాల్లో నటించడం.
బొద్దుగా ఉండే కీర్తి సురేశ్‌ను ఎప్పుడు చూస్తాం?
కీర్తి సురేశ్: త్వరలోనే..
‘సర్కారు వారి పాట’లో అవకాశం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?
కీర్తి సురేశ్: చాలా ఎగ్జైట్ అయ్యా. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.
జాతీయ అవార్డును అందుకుంటున్న సమయంలో ఎలా ఫీల్ అయ్యారు?
కీర్తి సురేశ్: భయపడ్డా. కృతజ్ఞురాలిగా భావించా. అది నమ్మలేని అనుభూతి.
మీకు ఇష్టమైన ఆహారం?
కీర్తి సురేశ్: దోశ.
మీకు ఇష్టమైన క్రికెటర్?
కీర్తి సురేశ్: ధోనీ.
మీ బలం ఏంటి?
కీర్తి సురేష్: ఆత్మస్థైర్యం.