హీరోయిన్ కీర్తి సురేశ్ 'గుడ్‌లక్ సఖి' చిత్రం గుర్తుందా? అవునా ఈ సినిమా ఒకటి ఉందా అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా.. కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ జూన్ 3న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మార్చిలో ప్రకటించారు.
Keerthy suresh: కీర్తి సురేశ్ 'గుడ్‌లక్ సఖి' రిలీజ్ ఎప్పుడు? - Keerthy suresh movie news
ముద్దుగుమ్మ కీర్తి సురేశ్ నటించిన 'గుడ్‌లక్ సఖి'.. దాదాపు ఏడాది నుంచి వాయిదాలు పడుతూనే వస్తోంది. అయితే నిర్మాతలు ఈ సినిమా గురించి ఏం ఆలోచిస్తున్నారో?
కీర్తి సురేశ్ గుడ్‌లక్ సఖి మూవీ
ఇప్పుడు చెప్పిన తేదీ దాటిపోయినప్పటికీ నిర్మాతలు సినిమా కొత్త విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఓటీటీలో తీసుకొస్తే సరికదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే కీర్తి సురేశ్ నుంచి గతేడాది ఓటీటీలో వచ్చిన 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' చిత్రాలు.. ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపర్చాయి. అందుకే 'గుడ్‌లక్ సఖి'ని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారేమో!
ఇవీ చదవండి: