ఇప్పటికే చాలాసార్లు వాయిదాపడిన కీర్తి సురేశ్ 'గుడ్‌లక్ సఖి'.. జనవరి 28న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఆద్యంతం నవ్విస్తున్న ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.
ఇందులో గిరిజిన యువతిగా కీర్తి సురేశ్ నటించింది. షూటింగ్లో ఓనమాలు తెలియని ఓ యువతి.. జాతీయ స్థాయి షూటర్‌గా ఎలా ఎదిగింది? ఇందులో ఎదుర్కొన్న ఆటుపోట్లేంటి అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో కీర్తి సురేశ్‌తోపాటు జగపతిబాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. జాతీయ అవార్డు గ్రహీత నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించారు.