సూపర్‌స్టార్ రజనీకాంత్.. ప్రస్తుతం 'దర్బార్' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత తన 168వ సినిమాను దర్శకుడు శివతో చేయనున్నాడు. ఇందుకోసం భారీ తారాగణం సిద్ధం చేస్తున్నారట. తలైవా పక్కన హీరోయిన్లుగా మీనా, ఖుష్బూ నటించనున్నారని సమాచారం. వీరితో పాటే కథానాయిక కీర్తి సురేశ్‌ను రజనీ కూతురి పాత్ర కోసం ఎంపిక చేశారట. పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
సూపర్‌స్టార్ రజనీ కూతురిగా కీర్తి సురేశ్! - రజనీకాంత్-కీర్తి సురేశ్
తలైవా రజనీకాంత్ కొత్త సినిమాలో హీరోయిన్లుగా మీనా, ఖుష్బూ.. కూతురి పాత్రలో కీర్తి సురేశ్ నటించనున్నారట. శివ దర్శకత్వం వహించనున్నాడు.
రజనీకాంత్-కీర్తి సురేశ్
'దర్బార్'లో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ అధికారిగా రజనీకాంత్ నటిస్తున్నాడు. నయనతార హీరోయిన్. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకుడు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10 ప్రేక్షకుల ముందుకు రానుంది.