తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖ సంగీత దర్శకుడితో కీర్తి సురేశ్ పెళ్లి? - కీర్తి సురేశ్ న్యూస్

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్​తో కీర్తి సురేశ్​ పెళ్లి జరగనుందని సమాచారం. దీని గురించి పలు వార్తలు వస్తున్నప్పటికీ, ఈ విషయాన్ని వాళ్లు ధ్రువీకరించాల్సి ఉంది.

Keerthy Suresh And Anirudh Ravichander Planning To Tie The Knot This Year
ప్రముఖ సంగీత దర్శకుడితో కీర్తి సురేశ్ పెళ్లి?

By

Published : Feb 13, 2021, 10:23 AM IST

Updated : Feb 13, 2021, 11:35 AM IST

హీరోయిన్​ కీర్తి సురేశ్.. చెన్నైకి చెందిన ఓ బిజినెస్​మ్యాన్​ను పెళ్లి చేసుకోనుందని చాలా రోజుల నుంచి వదంతులు వస్తూనే ఉన్నాయి. దానితో పాటే మరో వార్త ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఇంతకీ అదెంటంటే?

'మాస్టర్​'తో ఇటీవల హిట్​ కొట్టిన ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్​.. పలు సినిమాలు బిజీగా ఉన్నారు. అయితే హీరోయిన్​ కీర్తి సురేశ్​తో ఇతడు ప్రేమలో ఉన్నాడని, ఈ ఏడాది చివర్లో వీళ్ల పెళ్లి కూడా జరగనుందని సమాచారం. అయితే ఈ విషయమై అనిరుధ్-కీర్తి స్పందించాల్సి ఉంది.

అనిరుధ్ రవిచందర్​తో కీర్తి సురేశ్

కీర్తి సురేశ్​ ప్రస్తుతం అన్నాత్త, సర్కారు వారి పాట, రంగ్​ దే, గుడ్​లక్ సఖి సినిమాల్లో నటిస్తోంది. అనిరుధ్.. డాక్టర్, విక్రమ్, ఇండియన్ 2, విజయ్ 65, కాతువక్కల్ రెండు కాదల్ చిత్రాలకు సంగీతమందిస్తూ బిజీగా ఉన్నారు.

Last Updated : Feb 13, 2021, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details