కీర్తి సురేశ్ అందం ముందు వెన్నెలైనా చిన్నబోవాల్సిందే. అంతటి అందగత్తెను కళాశాల చదివే రోజుల్లో ఎన్ని ప్రేమ లేఖలు వచ్చాయని అడిగితే ఇలా సమాధానం చెప్పుకొంటూ వచ్చింది.
ఆ ప్రేమలేఖను భద్రంగా దాచుకున్న కీర్తి సురేశ్ - keerthy suresh latest news
తనకొచ్చిన ఓ ప్రేమలేఖ గురించి ఎంతో ఇష్టంగా చెప్పింది హీరోయిన్ కీర్తి సురేశ్. దానిని ఇప్పటికీ భద్రంగా దాచుకున్నట్లు తెలిపింది.
'ఓ సారి నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లాను. అక్కడ ఓ అభిమాని నా దగ్గరికి వచ్చి బహుమతి ఇచ్చి వెళ్లాడు. అందులో నా ఫొటోలన్నీ పెట్టి ఓ ఆల్బమ్‌లా తయారు చేశాడు. వాటితో పాటే ఓ ఉత్తరం ఉంది. ఏంటని చూస్తే అందులో అతడు నాకు ప్రపోజ్ చేశాడు. నేను దాన్ని చాలా భద్రంగా దాచుకున్నా. ఎందుకంటే నేను కాలేజీ చదివే రోజుల్లో నాకు ఒక్క ప్రేమలేఖ కూడా రాలేదు' అని ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది కీర్తి సురేశ్.
ఇటీవలే 'పెంగ్విన్' సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చిన ఈ భామ.. 'గుడ్ లక్ సఖి', 'రంగ్‌దే' చిత్రాల్లో నటిస్తోంది. త్వరలో ఆ రెండు విడుదల కానున్నాయి.