తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సాని కాయిదం'లో డీగ్లామర్​గా​ కనిపించిన కీర్తి సురేశ్

కీర్తి సురేశ్​ నటిస్తున్న తమిళ చిత్రం 'సాని కాయిదం'. ఈ సినిమా ఫస్ట్​లుక్ ఆదివారం విడుదలైంది. ఇందులో ఆమె డీగ్లామర్​ రోల్​లో కనిపిస్తూ.. పాత్రపై ఆసక్తి కలిగిస్తోంది.

By

Published : Nov 15, 2020, 5:02 PM IST

SaaniKaayidham
కీర్తి సురేశ్​ లుక్​

వినూత్న పాత్రలతో ఆకట్టుకుంటున్న నటి కీర్తి సురేశ్​ మరో విభిన్న పాత్రలో కనువిందు చేయనుంది. ఆమె నటిస్తున్న 'సాని కాయిదం' సినిమా తొలిరూపు ఇవాళ విడుదలైంది. అందులో కీర్తి 'డీగ్లామర్'​ రోల్​లో కనిపించింది. అయితే ఆమె రూపు మాత్రం సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది.

సాని కాయిదం ఫస్ట్​లుక్

ఈ సినిమాలో ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్​ ఓ పాత్ర పోషిస్తున్నాడు. 7/జీ బృందావన్​ కాలనీ, యుగానికి ఒక్కడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులో వంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ కలిసి తొలిసారి నటిస్తున్నారు. అరుణ్​ మాతేశ్వరన్ ఈ చిత్రానికి​ దర్శకుడు.

ABOUT THE AUTHOR

...view details