'మహానటి' చిత్రంతో నటిగా జాతీయ స్థాయిలో కీర్తి దక్కించుకుంది కీర్తి సురేశ్. ఇప్పుడీ చిత్రంతో వచ్చిన గుర్తింపును కాపాడుకుంటూ వైవిధ్యభరిత సినిమాలతో కెరీర్‌ను జోరుగా పరుగులు పెట్టిస్తోంది. ఓవైపు నాయికా ప్రాధాన్యమున్న చిత్రాలతో దూసుకెళ్తూనే.. రజనీకాంత్, మహేష్‌బాబు లాంటి అగ్ర తారలతోనూ తెర పంచుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవన్నీ బడా చిత్రాలే.
వెబ్‌సిరీస్‌కు నిర్మాతగా కీర్తి సురేశ్? - keerthi suresh movies
నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేశ్ ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోందట. ఆమె ఓ తమిళ వెబ్‌సిరీస్‌ను రూపొందించబోతున్నట్లు సమాచారం.
నటిగా ఇంత తీరిక లేకుండా ఉన్న కీర్తి.. ఇప్పుడు మరో కొత్త అవతారమెత్తనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. త్వరలోనే ఆమె నిర్మాతగా ఓ తమిళ వెబ్‌సిరీస్‌ను రూపొందించబోతున్నట్లు సమాచారం. దీని ద్వారా కీర్తి ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేయనుందట. కీర్తి తండ్రి జి.సురేష్ కుమార్ ఓ ప్రముఖ దర్శక నిర్మాత. ఇప్పుడు తండ్రి బాటలోనే కీర్తి ప్రొడ్యూసర్‌గా తన అభిరుచి చూపించాలనే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది.
నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో 'గుడ్‌లక్ సఖి' అనే చిత్రంలో నటిస్తోంది కీర్తి. ఇటీవలే విడుదలైన టీజర్.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇందులో కీర్తితో పాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.