ప్ర: మీ కుటుంబ సభ్యులతో చిత్ర పరిశ్రమకు ఎనలేని అనుబంధం ఉంది. ఇంతమంది ఎంగేజ్ చేయగలుగుతున్నారు కదా.. ఏమనిపిస్తుంది..?
జ:ఎవరి కాళ్ల మీద వారు నిలబడ్డారు. అనే దృక్పథంతోనే ఉంటాను. ఇంత మంది నా వాళ్లు చిత్ర పరిశ్రమలో ఉన్నారు అని ఎప్పుడూ అనుకోను. ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఎవరి పని మీద వాళ్లు బిజీగా ఉంటున్నారు. అందుకు గర్వపడుతున్నా.
ప్ర: ఇన్నేళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించారు. ఎలా అనిపిస్తుంది..?
జ: బ్రహ్మానందంతో పోల్చితే నేనెక్కడా. ఆయన తన కెరీర్లో ఎంతో మందిని అలరించారు. సినిమా అనేది ఒక వృత్తి అంతే. వృత్తిలో సక్రమంగా పనిచేస్తున్నామనేదే గర్వకారణం.
ప్ర: మీ అబ్బాయిల్లో ఒకరు గాయకుడు.. మరొకరు నటుడు.. వారి గురించి..?
జ: మంచి పేరు తెచ్చుకున్నందుకు సంతోషం. వాళ్లు ప్రారంభ దశలో ఉన్నారు. ఈ పరిశ్రమలో కష్టపడితేనే పైకి వస్తారు. లేదంటే జారిపోతారు.
ప్ర: ఆర్ఆర్ఆర్పై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే టీజర్ ఎలా ఉండబోతుంది..?
జ: తర్వాత టీజర్ కరోనా స్థాయిలో ఉండబోతుంది(నవ్వుతూ). కరోనా వల్ల ఏ మేరకు మా పని ప్రభావమైందో అలా ఉండబోతుంది. అది మంచైనా.. చెడైనా..!
ప్ర: ఆర్ఆర్ఆర్పై కరోనా ప్రభావం ఉంటుందా..?
జ: ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం అన్ని పనులు ఆగిపోయాయి. లాక్డౌన్ తర్వాత మేం ఎలా పనిచేయగలమో అలానే చేస్తాం.
ప్ర:మీ కెరీర్లో మీకు గర్వంగా అనిపించిన, తృప్తినిచ్చిన చిత్రం ఏది..?