తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనాపై పాట రూపొందించిన కీరవాణి.. నెట్టింట వైరల్​ - టాలీవుడ్​

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలతో పాటు పలువురు ప్రముఖులు తమ వంతు ప్రచారాన్ని చేస్తున్నారు. సినీప్రముఖులు ఈ కార్యక్రమాల్లో భాగమయ్యారు. తాజాగా సంగీత దర్శకుడు ఎమ్​ఎమ్​ కీరవాణి కరోనాపై ఓ గీతాన్ని రూపొందించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్​గా మారింది.

keeravaani composed a song on corona virus
కరోనాపై పాట రూపొందించిన కీరవాణి.. నెట్టింట వైరల్​

By

Published : Apr 1, 2020, 10:43 AM IST

'ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే చేరింది. మహమ్మారి రోగమొక్కటి..' అని అంటున్నాడు సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను తరిమికొట్టే పోరాటంలో ప్రభుత్వాలతో పాటు సినీ కళాకారులు కూడా భాగస్వాములవుతున్నారు. తమదైన శైలిలో పాటలు పాడుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే కరోనా నివారణ చర్యలపై అవగాహన పెంచుతూ చిరంజీవి, నాగార్జున తదితర సినీ ప్రముఖులు ఓ వీడియోలో నటించారు.

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సెలబ్రిటీలతో కరోనా కట్టడిపై అవగాహన కల్పిస్తూ.. వీడియోలను విడుదల చేశాయి. అయితే తాజాగా 'స్టూడెంట్‌ నెంబర్‌ 1' సినిమాలోని 'ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..' పాట సాహిత్యం మార్చి కీరవాణి మరో పాటను రూపొందించాడు. ఈ పాట యూట్యూబ్‌లో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి.. మలయాళ రీమేక్​లో బాలయ్య-రానా!

ABOUT THE AUTHOR

...view details