(kaun banega crorepati 2021) బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం.. 'కౌన్ బనేగా కరోడ్‌పతి 13' షోలో కన్నీటి పర్యంతమయ్యారు. తన కొత్త సినిమా 'సత్యమేవ జయతే 2' ప్రచారంలో భాగంగా షోలో పాల్గొన్న అతడు.. కన్నీరు ఆపుకోలేకపోయారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ శుక్రవారం ప్రసారం కానుంది.
(satyameva jayate 2)'సత్యమేవ జయతే 2' హీరోహీరోయిన్లు జాన్ అబ్రహం, దివ్య ఖోస్లా కుమార్.. అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి 13' షోలో సందడి చేశారు. తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన జాన్.. సిక్స్ ప్యాక్ చూపించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత చేతి వేలిపై ఫుట్‌బాల్‌ను తిప్పి మెప్పించారు. ఆ తర్వాత 'ధూమ్' సినిమా అమితాబ్ ఇంటికి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.