తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బిగ్​బీ ఆటోగ్రాఫ్​ కోసం జాకీష్రాఫ్​.. అడ్డుకున్న అభిషేక్​! - అమితాబ్​ బచ్చన్​ కౌన్​ బనేగా కరోడ్​ పతి

బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​తో(amitabh jackie shroff) తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మరో బీటౌన్​ నటుడు జాకీ ష్రాఫ్​. గతంలో ఆటోగ్రాఫ్​ కోసం బిగ్​బీ దగ్గరకు వెళ్తే అభిషేక్​, శ్వేతా బచ్చన్​ తనకు షాక్​ ఇచ్చారని వెల్లడించారు.

big b
బిగ్​బీ

By

Published : Sep 27, 2021, 7:55 PM IST

బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్(amitabh jackie shroff movies)​ అంటే ఎవరికి మాత్రం అభిమానం ఉండదు. అవకాశం వస్తే బిగ్​బీని కలవాలని, మాట్లాడాలని, వీలైతే ఆటోగ్రాఫ్​ తీసుకోవాలని అభిమానులు నుంచి స్టార్​ నటీనటుల వరకు ఎంతగానో ఎదురుచూస్తారు. అయితే ఓ సారి ఆటోగ్రాఫ్​ కోసం అమితాబ్​ వద్దకు వెళ్లబోతుంటే అభిషేక్​, శ్వేతా బచ్చనే అడ్డొచ్చి తన ఆటోగ్రాఫ్​ తీసుకున్నట్లు గుర్తుచేసుకున్నారు​ మరో బీటౌన్​ నటుడు జాకీష్రాఫ్​! అప్పుడు తాను షాక్​ అవ్వడం సహా సంతోషడినట్లు చెప్పారు. ఈ విషయాన్ని 'కౌన్​ బనేగా కరోడ్​ పతి'(kaun banega crorepati amitabh bachchan) కార్యక్రమంలో బిగ్​బీతో చెప్పారాయన.

"ఇది మీకు గుర్తుండకపోవచ్చు. మనం చెన్నైలో షూటింగ్​లో పాల్గొన్నాం. ఆ సమయంలో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చా. మీ దగ్గర ఆటోగ్రాఫ్​ తీసుకోవడానికి వచ్చా. అప్పుడు అభిషేక్​​, శ్వేతా బచ్చన్(చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు) మీ అసిస్టెంట్​తో కలిసి నాకు ఎదురొచ్చారు. 'వీరు అమితాబ్​ పిల్లలు. మీ ఆటోగ్రాఫ్​ తీసుకోవాలనుకుంటున్నారు' అని ఆ అసిస్టెంట్​ నాతో చెప్పాడు. 'నేనేమో బచ్చన్​ సార్​ ఆటోగ్రాఫ్​ కోసం వచ్చాను. వాళ్లు నా ఆటోగ్రాఫ్​ అడుగుతున్నారు. వావ్​' అని చెప్పా" అని తెలిపారు.

ఇంకా బిగ్​బీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జాకీష్రాఫ్(amitabh jackie shroff)​. వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. త్వరలోనే జాకీ.. 'సూర్యవంశీ', 'అతిథి దేవో భవా' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో 'పంజా', 'శక్తి', 'సాహో' సహా పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు.

ఇదీ చూడండి: Amitabh: అమితాబ్‌కు పేరు ఎవరు పెట్టారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details