తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించాం'

'ఏక్ మినీ కథ' (Ek Mini Katha)చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముంబయి భామ కావ్య థాపర్ (kavya Thaapr). ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్​లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆన్​లైన్​లో మీడియాతో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ పలు విషయాలు పంచుకుంది.

kavya thapar
కావ్య థాపర్

By

Published : Jun 5, 2021, 7:17 AM IST

"ఫలానా పాత్రలే చేయాలని ప్రత్యేకంగా లక్ష్యాలేమీ లేవు. నటిగా నన్ను నేను నిరూపించుకోగలిగే ప్రతి పాత్రనీ చేయాలనుకుంటున్నా" అంటోంది నటి కావ్య థాపర్‌(kavya Thaapr). 'ఈ మాయ పేరేమిటో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముంబయి అందం ఆమె. ఇటీవలే 'ఏక్‌ మినీ కథ'(Ek Mini katha) తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కార్తీక్‌ రాపోలు దర్శకుడు. ఈ మధ్యే ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆన్‌లైన్‌ వేదికగా మీడియాతో ముచ్చటించింది కావ్య. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

కావ్య థాపర్

"కార్తీక్‌ నాకు ఫోన్‌ చేసి ఈ కథ వినిపించారు. ఇది కొంచెం బోల్డ్‌ కాన్సెప్ట్‌, స్మాల్‌ పెనిస్‌ సిండ్రోమ్​పై ఉంటుందని చెప్పారు. ఇంత వరకు ఎవరూ స్పృశించని అంశమిది. అందుకే ఆయన లైన్‌ చెప్పగానే చాలా ఆసక్తికరంగా అనిపించింది. మరో ఆలోచన లేకుండా నేనీ సినిమా చేస్తానని చెప్పేశా."

"గతేడాది లాక్‌డౌన్‌ తర్వాత చిత్రీకరణ ప్రారంభించాం. ఓటీటీ ద్వారా ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రేక్షకులకు సురక్షితమైన వినోదాన్ని పంచివ్వగలిగాం. రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించాం. మా లక్ష్యం నెరవేరినందుకు తృప్తిగా ఉంది. ముంబయి నుంచి వచ్చిన అమ్మాయినైనా, తెలుగింటి ఆడపిల్లలా నన్ను ఆదరిస్తున్నారు. కెరీర్‌ ఆరంభంలోనే ఇంత మంచి విజయం దక్కడం ఎంతో సంతోషాన్నిస్తోంది."

కావ్య థాపర్

"సినిమాలో నా పాత్రకీ.. నా నిజ జీవితానికి కాస్త దగ్గర పోలికలుంటాయి. నేను చాలా సైలెంట్‌. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. జంతువుల సంరక్షణ కోసం ఏదోకటి చేయాలని పరితపిస్తుంటా. తెలుగు చిత్రసీమలో చిరంజీవి, ఎన్టీఆర్‌ల డ్యాన్స్‌ని చాలా ఇష్టపడతా. నాని, ప్రభాస్‌, రామ్‌చరణ్‌ల నటనని ఎంతో ఇష్టపడతా. వాళ్లతో కలిసి నటించాలనుంది. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నా. ప్రస్తుతం తెలుగులో పలు కథలు వింటున్నా. హిందీలో మూడు సినిమాలు చేస్తున్నా. చిత్రీకరణ దశలో ఉన్నాయి. త్వరలో వాటి వివరాలు ప్రకటిస్తా."

ABOUT THE AUTHOR

...view details