తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం

నటి కవిత ఇంట్లో విషాదం అలుముకుంది. ఆమె కుమారుడు సంజయ్.. కరోనాతో బుధవారం చనిపోయారు.

Kavitha
కరోనా

By

Published : Jun 17, 2021, 4:24 AM IST

కరోనా సెకండ్‌ వేవ్‌ సినిమా ఇండస్ట్రీని ఇంకా పీడిస్తూనే ఉంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్‌ రూప్‌ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. మరోవైపు ఆమె భర్త సైతం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత.. తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నారు. ఆమె కుమారుడి మృతిపై ఆయా చిత్రపరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:Ghantasala: ఘంటసాల రెండో కుమారుడు మృతి

ABOUT THE AUTHOR

...view details