తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రపంచకప్ ఫైనల్లో పాప్ స్టార్ కేటీ పెర్రీ ప్రదర్శన - ప్రపంచకప్ ఫైనల్లో కేటీ పెర్రీ

వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్​లో హాలీవుడ్ పాప్ స్టార్ కేటీ పెర్రీ అలరించనుంది. తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది.

ప్రపంచకప్ ఫైనల్లో పాప్ స్టార్ కేటీ పెర్రీ ప్రదర్శన

By

Published : Nov 13, 2019, 10:47 AM IST

అంతర్జాతీయ టోర్నీల్లో ప్రముఖ గాయకులు, నటులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకుంటారనే సంగతి తెలిసిందే. ఇలానే వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్​లో హాలీవుడ్ పాప్ గాయని కేటీ పెర్రీ అలరించనుంది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది.

"మెల్​బోర్న్​లో రికార్డులు బద్దలవుతాయేమో చూద్దాం. 2020 మార్చి 8న మెల్​బోర్న్​లో నన్ను కలిసే సిద్ధంగా ఉండండి. ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్​లో ప్రదర్శన ఇవ్వనున్నా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలకు మద్దతుగా మనమందరం గొంతు కలపాలి" - కేటీ పెర్రీ ఇన్​ స్టా పోస్ట్.

కేటీ ఒప్పందంతో ఈ వేడుకపై ఆసక్తి నెలకొంది. భారీ స్థాయిలో అభిమానులు వస్తారని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. 1999లో అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా జరిగిన ఫిఫా మహిళల ప్రపంచకప్ ఫైనల్​కు ఎక్కువ సంఖ్యలో 90, 185 మంది వచ్చారు. మెల్​బోర్న్ క్రికెటర్ గ్రౌండ్​లో లక్ష మంది పట్టే సామర్థ్యముంది.

ఇదీ చదవండి: ఈడెన్​లో డే/నైట్‌ టెస్టు మ్యాచ్​ సమయం ఖరారు..

ABOUT THE AUTHOR

...view details