అమెరికన్ పాప్‌సింగర్ కేట్ పెర్రీ.. తన గర్భధారణకు సంబంధించిన విషయాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. వచ్చే నెలలో జరగనున్న తొలి కాన్పు కోసం ఆమె ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటుందో వెల్లడించింది. ఆస్ట్రేలియా రేడియో షోలో వర్చువల్‌గా పాల్గొన్న కేట్ పెర్రీ.. తన గర్భధారణ జరిగినప్పటి నుంచి అనుభవాలను పంచుకుంది.
మాతృత్వపు అనుభూతి పొందుతున్నా: పెర్రీ - గర్భవతిగా మారిన పాప్ సింగర్ కాటి పెర్రీ
గర్భవతిగా మారిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని అంటోంది అమెరికన్ పాప్ సింగర్ కేట్ పెర్రీ. గర్భధారణ తర్వాత తనకు ఎదురైన అనుభవాలను తాజాగా ఆస్ట్రేలియా రేడియో షోలో వెల్లడించింది.
తల్లిగా మారడంపై ఆనందం వ్యక్తం చేసిన పాప్‌సింగర్ కాటి పెర్రీ
ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన బరువు 86 కిలోలకు పెరిగినట్లు తెలిపింది పెర్రీ. దీంతో తన చేతులు, పాదాలు లావెక్కాయని.. తాను ఎటు వెళ్లినా చెప్పులు ధరిస్తున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో గర్భం దాల్చిన మహిళల పట్ల తనకు ఎంతో గౌరవం పెరిగిందని తెలియజేసింది. అలా ఉండటం వల్ల సరికొత్త దృక్పథాన్ని పొందుతారని స్పష్టం చేసింది.