బాలీవుడ్ లవ్‌బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్.. డిసెంబరు 9న పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే రాజస్థాన్ చేరుకున్న ఇరువురు కుటుంబసభ్యులు.. పెళ్లి ముందు పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఓ విషయం నెటిజన్లు ఆశ్చర్యపరుస్తోంది.
నాలుగు రోజుల పాటు జరిగే విక్కీ-కత్రినా పెళ్లి పూర్తి వీడియో హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట. ఇందుకోసం దాదాపు రూ.80 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది నెటిజన్లకు అందుబాటులో రానుందని సమచారం.
ఓటీటీకి తమ పెళ్లి ఫుటేజ్ విక్రయించిన కారణంగా.. ఈవెంట్‌కు వచ్చే అతిథులు అందరూ ఎన్డీఏ నిబంధనపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా పెళ్లి మండపానికి ఫోన్ తీసుకురాకూడదు. ఈ మేరకు విక్కీ-కత్రినా ఓ స్పెషల్ నోట్ కూడా ఇచ్చారు.