బాలీవుడ్ నటీనటులైన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఈ మధ్య నటి ఆర్తి శెట్టి ఇంటికి కలిసి వెళ్లారు. ఇద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లినా బాలీవుడ్‌లో ఓ కొత్త వార్త బయటకు వస్తోంది. ప్రస్తుతం కత్రినా, విక్కీలు డేటింగ్ ఉన్నారని చెప్పుకుంటున్నారు. గతేడాది దీపావళి సందర్భంగా ఇద్దరు కలుసుకున్నారు. అప్పటి నుంచే ఈ వార్త మొదలైంది.
కత్రినా-విక్కీలు డేటింగ్‌లో ఉన్నారా..? - katrina kaif vicky kaushal spotted at friends dinner party spark dating rumours see pics
బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డేటింగ్‌లో ఉన్నట్లు చెప్పుకొంటున్నాయి బాలీవుడ్ సినీ వర్గాలు. నటి ఆర్తి శెట్టి ఇంటికి వీరిద్దరు కలిసి వెళ్లిన కారణంగా మరోసారి ఈ వార్తలకు బలం చేకూరినట్లయింది.
![కత్రినా-విక్కీలు డేటింగ్‌లో ఉన్నారా..? katrina k](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5661997-thumbnail-3x2-kart.jpg)
కత్రినా
కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'కాఫీ విత్ కరణ్ సీజన్ 6'లో కత్రినాను విక్కీ కౌశల్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమేనా అని కరణ్ అడినప్పుడు? కత్రినా "సిద్ధమే" అంటూ చెప్పింది. ప్రస్తుతం విక్కీ కౌశల్ 'సర్దార్ ఉద్దమ్ సింగ్'లో నటిస్తున్నాడు. ఇక కత్రినా కైఫ్ 'సూర్యవంశీ' చిత్రంలో అక్షయ్ కుమార్ భార్య అతిథి సూర్యవంశీగా నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 27న తెరపైకి రానుంది.
ఇవీ చూడండి.. మహేశ్ మాటలకు హీరోయిన్ రష్మిక 'హ్యాపీ డ్యాన్స్'